
హైదరాబాద్, వెలుగు: ఏపీలోని పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో తెలంగాణకు కలిగే నష్టంపై సీఎస్ రామకృష్ణ రావు సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టుపై ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 24న సమీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో.. సోమవారం సెక్రటేరియెట్‌లో ఇరిగేషన్ శాఖ అధికారులతో సీఎస్ సమావేశమయ్యారు.
పోలవరం ప్రాజెక్టుతో మనకు కలిగే నష్టాలు, ఆ ప్రాజెక్టు పురోగతి, మన రాష్ట్రం డిమాండ్ చేస్తున్న అంశాలు, సమస్యలను తెలుసుకున్నారు. పోలవరం బ్యాక్‌వాటర్‌పై అధ్యయనం చేయించాల్సి ఉందని అధికారులు సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. పోలవరం బ్యాక్ వాటర్‌తో 39 వాగులు, వంకలపై పడే వరద ప్రభావం, భద్రాచలానికి పొంచి ఉన్న ముంపు ముప్పుపై చర్చించారు.