
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఎంపీడీఓల ప్రమోషన్స్కోసం కసరత్తు చేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 37 మంది ఎంపీడీఓలకు డిప్యూటీ సీఈఓలుగా, 10 మంది డిప్యూటీ సీఈఓలకు సీఈఓలుగా ప్రమోషన్స్ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలిసింది. 2019 నుంచి 2022 వరకు ఎంపీడీఓలకు ప్రమోషన్ ప్రక్రియ కొనసాగింది. ఆ తర్వాత నుంచి ప్రమోషన్స్ ఊసేలేకుండా పోయిందని అధికారులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమోషన్స్‌కు సంబంధించిన ఫైల్ లో కదలిక వచ్చింది.
ఇందుకు సంబంధించిన ఫైల్ ఆరునెలల క్రితమే ప్రభుత్వం వద్దకు చేరినట్టు తెలిసింది. దీనిపై త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా, సూపరింటెండెంట్ల ప్రమోషన్స్ కోసం పంచాయతీరాజ్ శాఖజాబితా సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.