టీయూఎఫ్ఐడీసీకి ఫండ్స్ విడుదల

టీయూఎఫ్ఐడీసీకి ఫండ్స్ విడుదల
  • 800 కోట్లు రిలీజ్ చేస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ ఫ్రాస్టక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ( టీయూఎఫ్ఐడీసీ)కు రూ. 800 కోట్లు రిలీజ్ చేసేందుకు పరిపాలన అనుమతులు ఇస్తూ మున్సిపల్ శాఖ సెక్రటరీ టీకే. శ్రీదేవి సోమవారం జీవో జారీ చేశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సీసీ రోడ్లు, తాగునీటి సరఫరా, వాటర్ ట్యాంకుల నిర్మాణాలను టీయూఎఫ్ఐడీసీ చేపడుతోంది.

 2025– 26 ఫైనాన్షియల్ ఇయర్ లో భాగంగా ఈ ఫండ్స్ రిలీజ్ కు అనుగుణంగా జీవో ఇచ్చారు. మరో వైపు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చేపడుతున్న అమృత్– 2 పనుల కోసం రూ.8,78,01,000 నిధులకు పరిపాలన అనుమతులు ఇస్తూ మరో 4 జీవోలు జారీ చేశారు.