రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..న్యూ ఇయర్ వేళ ..ఎంఎంటీఎస్ సర్వీసులు సమయం పొడిగింపు

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..న్యూ ఇయర్ వేళ ..ఎంఎంటీఎస్ సర్వీసులు సమయం పొడిగింపు
  •     అర్ధరాత్రి 3 గంటల వరకు రైళ్లు

హైదరాబాద్​ సిటీ, వెలుగు : కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొని అర్ధరాత్రి వేళ ఇంటికి ఎలా వెళ్లాలా అని ఆలోచించే వారికి రైల్వే అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. డిసెంబరు 31 అర్ధరాత్రి 2.55 గంటల వరకు ఎంఎంటీఎస్​సర్వీసులు నడపనున్నట్టు ప్రకటించారు. ఆ రోజు లింగంపల్లి టు ఫలక్‌‌‌‌నుమా రైలు 1.30 గం.లకు స్టార్టయి 2.55కు ఫలక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నుమా చేరుకుంటుంది. 

లింగంపల్లి టు నాంపల్లి రైలు 1.15కు ప్రారంభమై 1.55కు నాంపల్లికి చేరుకుంటుంది. ఈ సమయాల్లో హఫీజ్​పేట, హైటెక్​సిటీ, బోరబండ, భరత్​నగర్​, ఫతేనగర్​, నేచర్​క్యూర్​హాస్పిటల్​, బేగంపేట, నెక్లెస్​రోడ్​, ఖైరతాబాద్, లక్డీకాపూల్​తదితర ప్రాంతాల నుంచి అర్ధరాత్రి వరకూ రైళ్ల రాకపోకలు ఉంటాయని తెలిపారు.