సందడిగా మారిన వేములవాడ

సందడిగా మారిన వేములవాడ

వేములవాడ, వెలుగు: వరుస సెలవులతో శుక్రవారం వేములవాడలోని భీమేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర కంటే ముందుగా వేములవాడలో కోడె మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. భీమేశ్వరుడి దర్శనం కోసం 5 గంటలు పట్టింది. ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. 70 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.