గోదావరిఖని, వెలుగు: సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలని ఎమ్మెల్యే ఎంఎస్.రాజ్ఠాకూర్ సూచించారు. శుక్రవారం గోదావరిఖనిలోని క్యాంప్ఆఫీస్లో అంతర్గాం, పాలకుర్తి మండలాల్లో ఇటీవల ఎన్నికైన సర్పంచులను సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. మేజర్ గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షలు, చిన్న గ్రామాలకు రూ.5 లక్షల చొప్పున సీఎం రేవంత్రెడ్డి అందించనున్నారని తెలిపారు. తన వంతు సహకారం కూడా ఉంటుందని చెప్పారు.
అనంతరం క్యాంప్ ఆఫీస్లో ఎమ్మెల్యే అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేనీ, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి హాజరయ్యారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాలన్నారు. ఇందుకోసం మండల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. స్థానిక వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ఆవరణలో నిర్వహించిన రామగుండం కార్పొరేషన్ ఏరియా స్వర్ణకార సంఘం మీటింగ్కు ఎమ్మెల్యే హాజరయ్యారు.
స్వర్ణకార కల్యాణ మండప నిర్మాణానికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. బెంగాలీ వర్కర్ల నుంచి స్థానిక స్వర్ణకారులకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఏరియా స్వర్ణకార సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొండపర్తి నరహరి, కట్ట నగేశ్ కుమార్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు రంగు శ్రీనివాస్, నాయకులు శ్రీరామోజు సత్యనారాయణ, గుగ్గిల్ల రవీంద్రాచారి, కట్ట శ్రీధరాచారి, శ్రీరామోజు జగన్ పాల్గొన్నారు.
రామగుండంలో టూరిజం అభివృద్ధికి కృషి
రామగుండంలో టూరిజం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ తెలిపారు. శుక్రవారం రామగుండంలో పారా మోటార్ గ్లైడింగ్ను ఆయన ప్రారంభించారు. టూరిస్టులను ఆకర్షించేందుకు ఎల్లంపల్లి ప్రాజెక్టులో వాటర్ స్పోర్ట్స్, రామునిగుండాలలో లేదా మేడిపల్లి ఓసీపీ వద్ద జిప్ లైన్ గ్లైడింగ్, హాట్బెలూన్ గ్లైడింగ్ ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
రైల్వే ఎంప్లాయ్అర్జున్పారా మోటార్గ్లైడింగ్ చేయడం పట్ల ఆయనను అభినందించారు. తెలంగాణలో ఎక్కడా పారా మోటార్ గ్లైడింగ్ లేదని, రామగుండంలో పర్మినెంట్గా నిర్వహిస్తామని పేర్కొన్నారు.
