- ఎమ్మెల్యే విజయరమణారావు
సుల్తానాబాద్, వెలుగు: రోడ్లపై కేజీ వీల్స్ నడపొద్దని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు కోరారు. సుల్తానాబాద్ మండలంలోని నారాయణపూర్-, కొదురుపాక గ్రామాల నుంచి సమ్మక్క, సారలమ్మ జాతర ప్రదేశం వద్దకు రూ.95 లక్షలతో నిర్మించ తలపెట్టిన బీటీ రోడ్డు పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రోడ్లపై కేజ్‌వీల్స్‌తో తన ట్రాక్టర్ నడిచినా రూ.5 వేల ఫైన్వేయాలని అధికారులకు సూచించారు. రైతులు పంటల మార్పిడిపై శ్రద్ధ చూపాలని, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, సేంద్రియ ఎరువులు వినియోగించాలని చెప్పారు.
వచ్చే జూన్ లో రైతులకు పంటల సాగుపై సూచనలు, సలహాలు ఇచ్చేందుకు పెద్దపల్లిలో వ్యవసాయ శాస్త్రవేత్తలతో సదస్సు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్‌రావు, సర్పంచులు గుడుగుల సతీశ్, ఉత్తమకుమారి, మాజీ ఎంపీటీసీ మండల రమేశ్, ఉపసర్పంచులు రామారావు, తిరుపతిరావు, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
