తెలంగాణ రాష్ట్ర మహిళా కమీషన్లో నటుడు శివాజీ విచారణ ముగిసింది. శనివారం (డిసెంబర్ 27న) బుద్ధభవన్‌లో మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యి, తన వివరణ ఇచ్చుకున్నారు శివాజీ. ఈ క్రమంలో శివాజీని సుమారు గంటా 45 నిమిషాల పాటు మహిళా కమిషన్ విచారించింది. శివాజీ చేసిన అనుచిత వ్యాఖ్యలపై మహిళా కమిషన్ తీవ్రంగా స్పందిస్తూ, ఆయనను ప్రశ్నల వర్షంతో ముంచెత్తింది. ఈ నేపథ్యంలో కమిషన్ ఆయనను వివరణ కోరుతూ ప్రశ్నల వర్షం కురిపించింది. వ్యాఖ్యలు చేసిన సందర్భం, ఉద్దేశ్యం ఏమిటి? మీ వ్యాఖ్యలు మహిళల మనోభావాలను దెబ్బతీయలేదా? అనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది.
శివాజీకి మహిళా కమిషన్ సందించిన ప్రశ్నలు..
- మహిళలపై మీరు చేసిన వాఖ్యలు.. మహిళల గౌరవం, వ్యక్తిగత జీవితం ప్రభావితం చూపుతుందని కమిషన్ భావిస్తుంది.. దీనికి మీరేమంటారు?
- నటుడిగా మీ వాఖ్యలు సమాజంపై ప్రభావం చూపుతాయి. ఇది మీకు తెలిసే ఇలాంటి వ్యాఖ్యలు చేసారని కమిషన్ భావిస్తుంది.
- మహిళల వస్త్రాధారణ ఆధారంగా వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం: చదువుకున్న వ్యక్తి గా ఇది మీకు తెలియదా?
- మీ వాఖ్యలు మహిళలను కించపరిచనట్లు కానట్లయితే, వాటికి సంబంధించిన ఆధారాలు ఇవ్వండి?
- మీ వాఖ్యలు మహిళలపై దాడులు పెంచే విధంగా ఉన్నాయని ఫిర్యాదులు వచ్చాయి.. వీటికి మీ సమాధానం ఏంటి?
ఇలా శివాజీపై మహిళా కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. మరి వీటికి శివాజీ ఎలా స్పందించాడనేది తెలియాల్సి ఉంది. అయితే, శివాజీ చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. ముఖ్యంగా మహిళలను కించపరిచేలా ఉన్న వ్యాఖ్యలపై, మహిళా కమిషన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. మహిళా హక్కుల పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని కమిషన్ స్పష్టం చేస్తూ, ఇటువంటి వ్యాఖ్యలను సహించబోమని హెచ్చరించింది. అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా వెల్లడించింది. ఈ అంశంపై శివాజీ ఎలా స్పందిస్తారన్నది, మహిళా కమిషన్ తదుపరి చర్యలు ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.
