ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (IIMC) నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ 2026, జనవరి 12.
పోస్టుల సంఖ్య: 51. (సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్, ప్రొఫెషనల్ అసిస్టెంట్, జూనియర్ ప్రోగ్రామర్, అప్పర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్)
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ కళాశాల నుంచి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, ఏదైనా డిగ్రీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ బ్రాంచ్‌తో బి.టెక్./ బీఈ. లేదా ఎంసీఏ/ ఎంఎస్సీ (కంప్యూటర్ సైన్స్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఉద్యోగానుభవం తప్పనిసరి.
గరిష్ట వయోపరిమితి: యూడీసీ, స్టెనోగ్రాఫర్ పోస్టులకు 32 ఏండ్లు. ఇతర పోస్టులకు 35 ఏండ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
ALSO READ : తెలంగాణ RTCలో భారీగా ఉద్యోగాలు..
అప్లికేషన్ ఫీజు
గ్రూప్–ఏ పోస్టులు: జనరల్, ఓబీసీలకు రూ.1500, ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్ సర్వీస్ మన్ అభ్యర్థులకు రూ.750.
గ్రూప్-బి పోస్టులు: జనరల్, ఓబీసీలకు రూ.1000, ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్ సర్వీస్ మన్ అభ్యర్థులకు రూ.500.
గ్రూప్-సి పోస్టులు: జనరల్, ఓబీసీలకు రూ.500, ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్ సర్వీస్ మన్ అభ్యర్థులకు రూ. 250.
లాస్ట్ డేట్: 2026, జనవరి 12.
సెలెక్షన్ ప్రాసెస్
గ్రూప్–ఏ పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్వూ ఉంటుంది.
గ్రూప్–బీ, సీ పోస్టులకు రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఉంటాయి.
పూర్తి వివరాలకు iimcnt.samarath.edu.in వెబ్‌సైట్‌ను సంప్రదించండి.
