కార్యదర్శి పోస్టుల్లో ఐపీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల నియామకంపై వివరణ ఇవ్వండి : హైకోర్టు

కార్యదర్శి పోస్టుల్లో ఐపీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల నియామకంపై వివరణ ఇవ్వండి : హైకోర్టు
  • ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ పాలనలో భాగంగా ఐఏఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారులు నిర్వహించాల్సిన కార్యదర్శి పోస్టుల్లో ఐపీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారులను నియమించడంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి సోమవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను 10కి వాయిదా వేసింది. 

ప్రభుత్వ కార్యదర్శి హోదా పోస్టుల్లో ఐపీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారులను నియమిస్తూ సెప్టెంబర్​ 26న ప్రభుత్వం జారీ చేసిన జీవో 1342ను సవాలు చేస్తూ సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన న్యాయవాది వడ్ల శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైకోర్టులో పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేశారు. దీనిపై జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూరేపల్లి నంద విచారణ చేపట్టారు. వాదనలు విన్న న్యాయమూర్తి ప్రతివాదులకు నోటీసులిచ్చారు.