మైనారిటీ గురుకులాల్లో 24/7 మెడికల్ మానిటరింగ్.. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ హెడ్ ఆఫీసులో హెల్త్ కమాండ్ సెంటర్

మైనారిటీ గురుకులాల్లో 24/7 మెడికల్ మానిటరింగ్.. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ హెడ్ ఆఫీసులో హెల్త్ కమాండ్ సెంటర్

 

  • విద్యార్థులకు హెల్త్ ఇష్యూస్ రాకుండా, ఫుడ్ పాయిజన్ జరగకుండా చర్యలు 
  • ఆరుగురు డాక్టర్లు, ఇద్దరు చొప్పున సైకాలజిస్టులు, ఫుడ్ హైజీనిస్టులు, నలుగురు టెలి కౌన్సిలర్లు నియామకం 
  • ఉదయం, రాత్రి రెండు షిఫ్టుల్లో డ్యూటీలు
  • నెల రోజుల్లో 4 వేల మందికి ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో వైద్య సేవలు 
  • మిగిలిన గురుకులాలతో పోలిస్తే తగ్గిన సమస్యలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 205 మైనారిటీ గురుకులాల్లో 24 గంటల పాటు మెడికల్​ మానిటరింగ్​ చేస్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్ నాంపల్లిలోని హెడ్​ ఆఫీసులో హెల్త్​ కమాండ్​ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇందులో ఆరుగురు డాక్టర్లు, ఇద్దరు సైకాలజిస్టులు, ఇద్దరు ఫుడ్ హైజీనిస్టులు, నలుగురు టెలి కౌన్సిలర్లు విధులు నిర్వహిస్తున్నారు.  పొద్దున, రాత్రి వేళల్లో రెండు షిఫ్టుల్లో పని చేస్తున్నారు. 

మైనారిటీ రెసిడెన్షియల్​స్కూల్స్, కాలేజీల్లో చదువుకునే స్టూడెంట్లకు హెల్త్ ఇష్యూస్ రాకుండా, ఫుడ్ పాయిజన్ జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. గడిచిన నెల రోజుల్లో 4 వేల మందికి పైగా విద్యార్థులకు వైద్య సేవలందించారు. దీంతో మిగిలిన గురుకులాలతో పోలిస్తే మైనారిటీ రెసిడెన్షియల్ ​స్కూల్స్​, కాలేజీల్లో సమస్యలు తగ్గిపోయాయి.  

ప్రతిరోజు పర్యవేక్షణ.. 

రాష్ట్ర ప్రభుత్వం వెయ్యికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలతో పాటు టీఎస్ఆర్ఎస్​రెసిడెన్షియల్​స్కూల్స్, కాలేజీలను ఏర్పాటు చేసింది. వీటిలో ఐదో తరగతి నుంచి ఇంటర్​వరకు 4 లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. 

గురుకులాల్లో కొన్ని చోట్ల పరిసరాల పరిశుభ్రత పాటించకపోవడం, కుకింగ్, డైనింగ్​ఏరియాలో క్లీనింగ్​లేకపోవడం వంటి సమస్యలతో స్టూడెంట్స్​కు హెల్త్​ఇష్యూస్​వస్తున్నాయి. అలాగే ఫుడ్​పాయిజన్​సంఘటనలు అక్కడక్కడ జరుగుతున్నాయి. కొందరు స్టూడెంట్స్​ సైకలాజికల్​సమస్యలతో బాధపడుతూ చదువు మానేయడం, స్కూల్స్​ వదిలివెళ్లిపోవడం వంటివి చేస్తున్నారు. ఇలాంటి సమస్యలను గుర్తించిన మైనారిటీ డిపార్ట్​మెంట్​ ఆఫీసర్లు హెల్పింగ్​హ్యాండ్​ఫౌండేషన్​ సహకారంతో హైదరాబాద్​హెడ్​ఆఫీసులో హెల్త్ మానిటరింగ్​కమాండ్​సెంటర్ ఏర్పాటు చేశారు. పోలీస్​కమాండ్​కంట్రోల్​ మాదిరిగా 24/7 మెడికల్ మానిటరింగ్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. 8 డెస్క్​లు ఏర్పాటు చేసి కంప్యూటర్లు అమర్చారు. 

అలాగే అక్కడ పని చేసే సిబ్బంది అందరికీ కనిపించేలా 75 ఇంచుల టీవీ ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాల వారీగా ప్రతిరోజు స్టూడెంట్లకు సంబంధించిన డైలీ హెల్త్​ఇష్యూస్​పై డాష్​బోర్డు మెయింటెయిన్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ వైరల్, డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియాతో బాధపడే స్టూడెంట్స్​ఎందరున్నారు? దగ్గు, దమ్ముతో బాధపడేవాళ్లు, ఈఎన్టీ, జనరల్, గైనిక్, ట్రామా, మైనర్​ఇంజ్యూరిస్, చర్మ వ్యాధులు, ఫుడ్​పాయిజన్​ కేసులు ఎన్ని ఉన్నాయి? హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అడ్మిట్ అయినవాళ్లు ఎందరు? అనే దానిపై రోజువారీగా సమీక్షిస్తున్నారు.   

ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వైద్య సేవలు.. 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని హెల్త్​ కమాండ్​సెంటర్ సిబ్బంది ఇక్కడి నుంచే స్టూడెంట్లకు 24 గంటల పాటు ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్​ వైద్య సేవలు అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా వారానికి రెండుసార్లు జూమ్​మీటింగ్స్​నిర్వహిస్తున్నారు. ఒకే స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎక్కువ మంది స్టూడెంట్స్​అనారోగ్యానికి గురైతే, అక్కడికి వెళ్లి పరిశీలిస్తున్నారు. 

రాష్ట్రంలో ఎక్కడైనా సరే విద్యార్థులకు జ్వరం లేదా ఏ ఇతర హెల్త్​ఇష్యూస్​వచ్చినా.. ఆ స్కూల్​లో పనిచేసే స్టాఫ్​నర్స్​బాధిత స్టూడెంట్​వివరాలను కమాండ్​కంట్రోల్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డ్యూటీలో ఉండే  డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు షేర్ చేస్తుంది. అవసరమైతే అక్కడి నుంచే వాట్సప్​వీడియో కాల్​చేసి డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో స్టూడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మాట్లాడిస్తారు. దీంతో బాధిత విద్యార్థి అవస్థలు డాక్టర్ తెలుసుకుని ఏయే మెడిసిన్,​ ఎప్పుడెప్పుడు వాడాలో నర్స్​కు తెలియచేస్తారు. 

 ఒకవేళ స్టూడెంట్​హెల్త్​ఇష్యూ మరీ సీరియస్​గా ఉంటే దగ్గర్లోని హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేర్పిస్తారు. ఇలా గత నెల రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల మందికి పైగా విద్యార్థులకు హెల్త్​ కమాండ్ సెంటర్​ నుంచే డాక్టర్లు, ఇతర సిబ్బంది వైద్య సేవలందించారు. 43 మంది విద్యార్థులకు సైకలాజికల్ సమస్యలు రాగా, వాళ్లకు కౌన్సెలింగ్​ఇచ్చారు. దీంతో గత నెల రోజుల్లో ఇతర గురుకులాలతో పోలిస్తే మైనారిటీ గురుకులాల్లో హెల్త్​ఇష్యూస్​ తగ్గినట్టు రిపోర్టులు తెలియజేస్తున్నాయి.

రెండు షిఫ్టుల్లో సేవలు.. 

స్టూడెంట్స్​ హెల్త్​ మానిటరింగ్​చేయడానికి ఉదయం 9 నుంచి రాత్రి 6, రాత్రి  6 నుంచి ఉదయం 9 వరకు రెండు షిఫ్టుల్లో సిబ్బంది పని చేస్తున్నారు. డే షిఫ్టులో నలుగురు ఎంబీబీఎస్​ డాక్టర్లు, ఇద్దరు ఫుడ్​హైజినిస్టులు, ఇద్దరు సైకాలజిస్టులు, ఇద్దరు టెలీ కౌన్సిలర్లు.. నైట్​షిఫ్టులో ఇద్దరు ఎంబీబీఎస్​డాక్టర్లు, ఇద్దరు టెలీ కౌన్సిలర్లు డ్యూటీ చేస్తున్నారు. 

హెల్త్ కమాండ్​సెంటర్ నోడల్​ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా జరీనా ఫాతిమా, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఇమ్రాన్​మొహమ్మద్​, క్యూ మేనేజర్లుగా మరియం ఫాతిమా, మెరుగు రాజేంద్రం పని చేస్తున్నారు. అలాగే ఎంబీబీఎస్​ డాక్టర్లు మొహిమున్నా ఫర్దోస్​, సమ్రీన్​ ఉన్నీసా, అబ్దుల్లా ఖాన్​, మొహమ్మద్​అయూబ్​ బీ, గజాలా తస్రీన్, జురా అబ్దుల్​ రహీం, ఫుడ్ హైజినిస్టులు శ్వేత షిండే, రచన, సైకాలజిస్టులు మిర్యాల లావణ్య, సులక్షణ తాడివాక, టెలీ కౌన్సిలర్లుగా మాధవి, రాజేశ్వరి, ఫాతిమా సేవలందిస్తున్నారు.