మైనార్టీ గురుకులాల అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్

మైనార్టీ గురుకులాల అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్
  • ఐదో క్లాస్ నుంచిఇంటర్ వరకు ప్రవేశాలు

హైదరాబాద్, వెలుగు: మైనార్టీ గురుకులాల్లో వచ్చే అకడమిక్ ఇయర్ అడ్మిషన్ల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. ఈ మేరకు సోమవారం సెక్రటెరియేట్ లో మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీన్, కార్పొరేషన్ చైర్మన్ ఫయిమ్ ఖురేషీ, గురుకుల సెక్రటరీ షఫీయుల్లా దీన్ని రిలీజ్ చేశారు. ఐదవ తరగతి నుంచి ఇంటర్ వరకు ఈ సీట్లను భర్తీ  చేయనున్నారు. మొత్తం15 వేల సీట్లు ఉండగా ఆన్​లైన్​లో www.tgmreistelangana.cgg.gov.in వెబ్ సైట్ లో అప్లై చేసుకోవాలని మంత్రి, సెక్రటరీ సూచించారు.

ఈ అడ్మిషన్లపై అనుమానాల నివృత్తికి ప్రతి మైనార్టీ గురుకులంతో పాటు హైదరాబాద్ లోని హెడ్ ఆఫీస్ లో హెల్ప్  లైన్ సెంటర్ ఏర్పాటు చేశామని తెలిపారు. మొత్తం 107 స్కూళ్లు ఉండగా ఇందులో 98 గర్ల్స్ ఇనిస్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇందులో 75 శాతం మైనారిటీలకు, 25 శాతం నాన్ మైనారిటీలకు రిజర్వ్​ చేశామని చెప్పారు. ఉపాధి అవకాశాల కోసం 13 కాలేజీల్లో వొకేషనల్ కోర్సులతో పాటు ఐఐటీ, జేఈఈ, నీట్, సీఏ, క్లాట్ ఎగ్జామ్స్ లకు కోచింగ్ ఇస్తున్నామని సెక్రటరీ షఫీయుల్లా పేర్కొన్నారు.