- విజేతలను ప్రకటించిన ఎన్నికల ఆఫీసర్లు.. ఇంకా కొనసాగుతున్న కౌంటింగ్
హైదరాబాద్, వెలుగు: తొలి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. అర్ధరాత్రి వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. గురువారం రాత్రి 11గంటలకు అందిన సమాచారం ప్రకా రం 3,300 సర్పంచ్, 24,906 వార్డు స్థానాల్లో లెక్కింపు పూర్తయినట్టు ఎలక్షన్ ఆఫీసర్లు అధికారికంగా ప్రకటించారు. అలాగే, 1,650 గ్రామాల్లో ఉపసర్పంచ్‌ల ఎన్నిక కూడా పూర్త యింది. మిగతా చోట్ల లెక్కింపు ప్రక్రియ కొన సాగుతుందని, శుక్రవారం అన్ని స్థానాల డిటై ల్స్ ప్రకటిస్తామని పేర్కొన్నారు.
కొన్ని చోట్ల రీకౌం టింగ్ జరగడం, మరికొన్ని చోట్ల ఆలస్యంగా లెక్కింపు మొదలు పెట్టడంతో పూర్తిస్థాయి సమాచారం రాలేదని తెలిపారు. అలాగే, చనిపోయిన అభ్యర్థికి అత్యధిక ఓట్లు.. ఫలితం ప్రకట నపై తర్జనభర్జన పడుతున్నారు. ఒక్క ఓటు తేడా తో విజయం సాధించిన చోటా రీకౌంటింగ్ కోరడంతో ఫలి తాలు వెలువరించడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు.

