- నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్, (వెలుగు ): తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో రైతాంగాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నకిరేకల్ లోని స్థానిక ఫంక్షన్ హాల్లో మంగళవారం గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్ట్ ఆధ్వర్యంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల జాతీయ రైతు దినోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని వివరించారు. తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ ఎం.కోదండ రెడ్డి మాట్లాడుతూ.. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు పొందే విధంగా ప్రభుత్వం రైతులను ప్రోత్సహించడం శుభ పరిణామం అన్నారు.
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రైతు కమిషన్ సభ్యులు భూమి సునీల్, భవాని రెడ్డి, గోపాల్ రెడ్డి , గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ రాజేందర్ రెడ్డి, నకిరేకల్ మార్కెట్ చైర్మన్ మంజుల మాధవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రజిత శ్రీనివాస్, ట్రస్మా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కందాల పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి 70 మంది ఆదర్శ రైతు దంపతులు పాల్గొన్నారు. తెలంగాణ నుండి జాల ఎల్లయ్య యాదవ్, ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ రాసు ప్రతాపరెడ్డిని ఉత్తమ రైతులుగా ఎంపిక చేసి వారికి అవార్డులు అందజేశారు. ఎడ్ల బండ్లతో భారీ ప్రదర్శన నిర్వహించారు.
