అన్యాయం చేసిన బీఆర్ ఎస్ పాలకులు

అన్యాయం చేసిన బీఆర్ ఎస్ పాలకులు
  • రాష్ట్ర రికగ్నైజ్డ్ టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్ అండ్ కంప్యూటర్ అసోసియేషన్

బషీర్ బాగ్, వెలుగు :  గత ప్రభుత్వం హయాంలో తీవ్ర అన్యాయానికి గురయ్యామని తెలంగాణ రికగ్నైజ్డ్ టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్ కంప్యూటర్ అసోసియేషన్ వాపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వమైనా గ్రూప్- 3, గ్రూప్ - 4 నోటిఫికేషన్స్ లో టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ పోస్టులను ప్రకటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అసోసియేషన్ నేతలు విజ్ఞప్తి చేశారు. 

గత జనవరిలో తమిళనాడులో 2 వేల టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ పోస్టులను ప్రభుత్వం ప్రకటించి నిరుద్యోగులను ఆదుకుందని, తెలంగాణ ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరారు. 

ఆదివారం హైదర్ గూడ లోని ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్ బాలిగ మాట్లాడుతూ.. టైపిస్ట్, స్టెనోగ్రాఫర్  శిక్షణలో ఉత్తీర్ణత సాధించిన లక్షలాది మంది నిరుద్యోగులు జాబ్ ల కోసం ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.