అర్మేనియాలో తెలంగాణ యువకుడు మృతి

అర్మేనియాలో తెలంగాణ యువకుడు మృతి

బోయినిపల్లి, వెలుగు: ఉపాధి కోసం విదేశానికి వెళ్లిన తెలంగాణ యువకుడు యాక్సిడెంట్ లో చనిపోయాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రానికి చెందిన మేకల ప్రవీణ్(33)కు రూ. 10 లక్షలు అప్పులయ్యాయి. దీంతో ఉపాధి కోసం తొమ్మిది నెలల కింద యూరప్​ఖండంలోని అర్మేనియా దేశానికి వెళ్లాడు. అక్కడ శుక్రవారం రోడ్డు పక్కన నిల్చున్న ప్రవీణ్ ను వెహికల్ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు.

స్థానికులు ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో బోరున విలపించారు. ప్రవీణ్​కు తల్లిదండ్రులు, భార్య కవిత, కూతురు శ్రావణి, కొడుకులు సంజయ్, అభినయ్ ఉన్నారు. డెడ్ బాడీని సొంతూరికి తీసుకొచ్చేలా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్పందించి చొరవ తీసుకోవాలని కుటుంబసభ్యులు కోరారు.