గంటలో దోపిడీ కేసును ఛేదించిన ఆదిలాబాద్ టూ టౌన్ పోలీసులు

గంటలో దోపిడీ కేసును ఛేదించిన ఆదిలాబాద్ టూ టౌన్  పోలీసులు

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ టూ టౌన్ పోలీసులు గంటలో దోపిడీని కేసును ఛేదించారు. ఆదిలాబాద్​లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్​లో పనిచేస్తున్న  మునేశ్వర్ గౌరవ్ అనే వ్యక్తి శనివారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు వాహనంపై వచ్చి అతడిని అడ్డుకొని అతడి వద్ద ఉన్న రూ.1050 నగదు, మొబైల్ లాక్కెళ్లారు. ఈ ఘటనపై ఆదివారం ఉదయం 10 గంటలకు టూ టౌన్ పోలీస్ స్టేషన్ బాధితుడు ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

ఆదిలాబాద్​కు చెందిన గజ్జె కరణ్, షేక్ మోయిన్, అర్బాజ్ ఖాన్​ను నిందితులుగా గుర్తించి గంటలోపే వారిని పట్టుకున్నట్లు సీఐ నాగరాజు తెలిపారు. జల్సాలకు అలవాటుపడి దొంగతనం చేశారని పేర్కొన్నారు. వారి వద్ద నుంచి దోపిడీ చేసిన నగదు, సెల్​ఫోన్, వాహనాన్ని స్వాధీనం చేసుకొని ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించిన్లు చెప్పారు.