వామ్మో : ఈ శివాలయాన్ని దెయ్యాలు నిర్మించాయి... అదెక్కడుందో తెలుసా...

వామ్మో : ఈ శివాలయాన్ని  దెయ్యాలు నిర్మించాయి... అదెక్కడుందో తెలుసా...

ఎట్టెట్టా? దెయ్యాలు గుడిని కట్టాయా? మేం ఎర్రిపప్పల్లా కనిపిస్తున్నామా అని అనకండి. ఎందుకంటే.. పురాణాలు చెబుతున్నాయి ఆ గుడిని దెయ్యాలు కట్టాయని. దెయ్యాలు ఉన్నాయి.. అని నమ్మేవాళ్లు మాత్రమే ఈ వార్త చదవడం బెటర్. ఎందుకంటే.. దెయ్యాలు ఉన్నాయని నమ్మని వాళ్లు ఈ వార్తను చదివినా నమ్మలేరు. సరే.. ఇంతకీ దెయ్యాలు ఆ గుడిని ఎలా కట్టాయి.. ఎందుకు కట్టాయి.. ఎక్కడ కట్టాయి అనే విషయాలు తెలుసుకోవాలనుందా? అయితే పదండి..

దేవుడున్నాడని నమ్మేవాళ్ళు దయ్యాలు కూడా ఉంటాయని విశ్వసిస్తారు.పురాణాల ప్రకారం మనదేశంలో కొన్ని ఆలయాలు స్వయంగా దేవతలే నిర్మించారని మనం చదివే ఉంటాం.అదే విధంగా దెయ్యాలు కట్టించిన ఆలయాలు కూడా మనదేశంలో ఉన్నాయి.  దెయ్యాలు నిర్మించిన ఆలయం కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో ఉంది.అయితే ఈ ఆలయాన్ని దెయ్యాలు కట్టించడం వెనుక ఉన్న కారణం కూడా ఉందని పురాణాలు చెబుతున్నాయి.  

బెంగళూరుకు సమీపంలోని  బొమ్మవర అనే గ్రామంలో సుందరేశ్వర ఆలయం ఉంది.ఈ ఆలయంలో శివుడు భక్తులకు దర్శనం ఇస్తుంటారు. ఈ ఆలయంలో ఉన్న శివలింగం ఎంతో అందంగా ఉంటుంది.అందుకే ఈ ఆలయాన్ని సుందరేశ్వర ఆలయం అని పిలుస్తారు. ఈ గ్రామంలో పూర్వం దెయ్యాలు విపరీతంగా ఉంటూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసేవట.ఈ దెయ్యాలను భరించలేక గ్రామ ప్రజలకి ఏం చేయాలో అర్థం కాక అదే ఊరికి చెందిన దెయ్యాలను కట్టడి చేసేందుకు  బుచ్చయ్య అనే మాంత్రికుడుని కలిసి పరిష్కార మార్గాన్ని అడిగారు. ఆ మాంత్రికుడికి ఉన్న మంత్ర విద్యలతో దెయ్యాలను తరిమికొట్టాలని ప్రయత్నించినప్పటికీ అతని చేతకాలేదు.

దీంతో ఆ ఊరిలో ఒక శివాలయం నిర్మించడం వల్ల దెయ్యాలను తరిమి కొట్టవచ్చునని భావించిన మాంత్రికుడు గ్రామ ప్రజల సహకారంతో ఆ ఊరిలో శివాలయాన్ని నిర్మించడంతో అది భరించలేని దెయ్యాలు రాత్రికిరాత్రి ఆలయాన్ని ధ్వంసం చేశాయని  స్థల పురాణం ద్వారా తెలుస్తోంది.దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ మాంత్రికుడు మరిన్ని మంత్ర విద్యలు నేర్చుకొని ఆ దెయ్యాలని తన వశం చేసుకున్నాడు. అనుకున్న విధంగానే వాటి జుట్టును కత్తిరించి ఒక రోకలికి కడుతాడు. ఆ దెయ్యాలు మాంత్రికుడి వశం కావడంతో వారికి విముక్తి కల్పించాలని శరణు కోరాయి.   అయితే అందుకు ఆ మాత్రికుడు ఆలయాన్ని తిరిగి పునర్నిర్మించాలని, అప్పుడే వారికి విముక్తి కలుగుతుందని తెలియజేయడంతో దెయ్యాలు రాత్రికి రాత్రే ఆ శివాలయాన్ని నిర్మించాయని పురాణాలు చెబుతాయి.