- మంత్రి ఈటల రాజేందర్
హైదరాబాద్: గత రెండు సంవత్సరాలుగా.. ముఖ్యంగా గత 395 రోజులుగా ఒక్క రోజు కూడా విరామం లేకుండా పనిచేస్తూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న తనకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు ఈటల రాజేందర్. తనను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి బాధ్యతల నుంచి తొలగించినట్లు గవర్నర్ ప్రకటించిన అనంతరం ఆయన స్పందించారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి, కుటుంబాలను వదిలిపెట్టి ప్రజలకు కరోనా చికిత్స అందించిన వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతధికారులు, డాక్టర్స్, నర్సులు, సెక్యూరిటీ సిబ్బంది, శానిటరీ స్టాఫ్, నాలుగవ తరగతి సిబ్బంది, గ్రామాల్లో పని చేస్తున్న ANM లు, ఆశా వర్కర్లు అందరికీ శిరస్సు వంచి ధన్యవాదములు తెలుపుతున్నానన్నారు ఈటల రాజేందర్.
