బాయిల్డ్ రైస్ ఒక్క గింజ కూడా తీసుకోమని కేంద్రం చెప్పింది

బాయిల్డ్ రైస్ ఒక్క గింజ కూడా తీసుకోమని కేంద్రం చెప్పింది

హైదరాబాద్: దేశంలో ఆహార ధాన్యాన్ని సేకరించడం, సేకరించిన ధాన్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందించడం, దేశ ఆహార భద్రత కోసం బఫర్ స్టాక్ నిల్వ చేయడం పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే అన్నారు సీఎం కేసీఆర్. కేబినెట్‌ మీటింగ్ తర్వాత  ప్రగతి భవన్‌లో మీడియాతో మట్లాడిన సీఎం.. కేసీఆర్ మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలను తెలిపారు.  "కేంద్రం తన బాధ్యత విస్మరించి ధాన్యం కొనబొం అంటుంది.  దేశ రైతాంగం గందరగోళంలో పడేశారు. కేంద్రానివి పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలు. ఇంత దిగజారిన, నీచమైన కేంద్ర పద్దతిని చూడలే. యాసంగిలో మేం ఇచ్చింది తీసుకోలే. కేంద్రం చిల్లర కొట్టులా వ్యవహరిస్తుంది. బాయిల్డ్ రైస్ ఒక్క గింజ కూడా తీసుకోమని కేంద్రం చెప్పింది. మెడ మీద కత్తిపెట్టి కేంద్రం లెటర్ రాయించుకుంది. ధాన్యం కొనుగోల్ల లంగనాటకం బయటపడాలి. పూర్తి స్థాయిలో పేదల వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నారు. బీజేపీ నేతల నిర్ణయాలు సామాన్య మధ్య తరగతి ప్రజలపై భారం మోపే విధంగా ఉంటున్నాయి" అని తెలిపారు సీఎం కేసీఆర్.