రాజ్ భవన్ స్కూల్కు ఉన్న క్రేజే వేరు..!

రాజ్ భవన్ స్కూల్కు ఉన్న క్రేజే వేరు..!

హైదరాబాద్ : రాజ్ భవన్ ప్రభుత్వ పాఠశాలకు ఉన్న క్రేజే వేరు. అక్కడ అడ్మిషన్ కోసం క్యూ కట్టడం కామన్. ఈ ఏడాది కూడా అదే జరిగింది. రాజ్ భవన్ పాఠశాల ప్రారంభానికి ముందు నుంచే ప్రవేశాల తాకిడి మొదలయ్యింది. స్కూల్స్ రిఒపెన్ అయిన ఒకటి రెండు రోజుల్లోనే నో అడ్మిషన్స్ అనే బోర్డును పెట్టాల్సిన పరిస్ధితి ఏర్పడింది. అయినా తల్లిదండ్రుల నుంచి అడ్మిషన్ల ప్రెజర్ తప్పడం లేదంటున్నారు అక్కడి ఉపాధ్యాయులు.  ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలలంటేనే అందరిలో చిన్నచూపు ఉంటుంది. కానీ హైదరాబాద్ రాజ్ భవన్ లోని ప్రభుత్వ పాఠశాల దీనికి భిన్నంగా ఉంది. గతంలో గవర్నర్ గా ఉన్న నరసింహన్ ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా తీర్చిదిద్దారు. అన్ని సౌకర్యాలతో పాటు ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెట్టడంతో దీని క్రేజ్ మరింత పెరిగింది. దీంతో ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులు కూడా రాజ్ భవన్ ప్రభుత్వ పాఠశాల్లో అడ్మిషన్ల కోసం క్యూ కట్టారు.

రాజ్ భవన్ స్కూల్ ప్రారంభించిన నాటి నుంచి ఏటా అడ్మిషన్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక్కడ చదువుకునే విద్యార్ధులకు సైతం మెరిట్ ర్యాంకులు వస్తుండడంతో స్కూల్ కు మరింత డిమాండ్ పెరిగింది. దీంతో ప్రతీ తరగతికి రెండు సెక్షన్లు ఏర్పాటు చేశారు. స్కూల్ సామర్ధ్యం 6 వందల మంది విద్యార్ధులు. ఐతే ఇక్కడ అడ్మిషన్ల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐపీఎస్, ఐఎఎస్ అధికారుల నుంచి రికమండేషన్స్ వస్తున్నాయంటున్నారు టీచర్లు. స్టూడెంట్స్ పెరగడంతో సెక్షన్ కు 30 మంది విద్యార్ధులు ఉండాల్సిన చోట... 50 మందికి పైగా పెంచారు.

ఈ అకాడమిక్ ఇయర్ లో ఫస్ట్ క్లాస్ కు 80 మంది విద్యార్ధులు అడ్మిషన్లు తీసుకున్నారు. సెకండ్ క్లాసులో 106, థర్డ్ క్లాస్ లో 106, ఫోర్త్ లో 145 , ఫిప్త్ లో 108... సిక్త్స్ లో 154, సెవెంత్ లో 133, యైత్ లో125, నైంత్ లో 131, టెన్త్ లో 136 మంది విద్యార్ధులున్నారు. 8 నుంచి  10 వ తరగతి వరకు ఒక్కో క్లాసును మూడు సెక్షన్స్ గా నడుపుతున్నారు. ప్రైమరీ, హైస్కూల్ కలిపి ప్రస్తుతం 12 వందల 24 మంది విద్యార్థులు ఉన్నారు. అడ్మిషన్ల కోసం పెద్ద సంఖ్యలో వస్తుండడంతో పేరంట్స్ ను ఎన్ రోల్ చేసుకోవాలని సూచిస్తున్నారు టీచర్లు. దీనికి సంబంధించి జూలై ఫస్ట్ వీక్ లో ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. రాజ్ భవన్ స్కూల్లో అడ్మిషన్ల కోసం ఆందోళనకు దిగుతున్నారు పేరంట్స్. ప్రైవేట్ పాఠశాల్లో ఫీజులు కట్టలేని వారు కొందరైతే.... ఇక్కడ ఎడ్యుకేషన్ బాగుండడంతో మరికొందరు పట్టుబడుతున్నారు.  రాజ్ భవన్ ప్రభుత్వ స్కూల్ తరహాలోనే రాష్ట్రంలోని మిగతా సర్కారీ బడులను తీర్చిదిద్దాలని కోరుతున్నారు పేరంట్స్, విద్యావేత్తలు.