narsingi : నార్సింగ్ లో.. అపార్ట్ మెంట్ ఇంట్లోకి దూసుకొచ్చిన తుపాకీ బుల్లెట్..!

narsingi : నార్సింగ్ లో..  అపార్ట్ మెంట్ ఇంట్లోకి దూసుకొచ్చిన తుపాకీ బుల్లెట్..!

వీకెండ్ ప్రశాంతంగా ఉన్న అపార్ట్ మెంట్.. 5వ అంతస్తులోని ప్లాట్.. ఒక్కసారి కలకలం.. ఇంట్లోని బెడ్ రూంలోకి.. కిటికీ అద్దాలు చీల్చుకుంటూ ఓ తుపాకీ బుల్లెట్ దూసుకొచ్చింది. అంతా షాక్.. ఏం జరుగుతుందో.. ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి.. ఈ ఘటన జరిగింది హైదరాబాద్ సిటీలోని నార్సింగ్ ఏరియా బైరాగీగూడలోని శివపురి అపార్ట్ మెంట్స్ లో.. పూర్తి వివరాల్లోకి వెళితే..

రంగారెడ్డి జిల్లా నార్సింగీ బైరాగీగూడలోని ఓ అపార్ట్‌మెంట్ లోకి బులెట్ దూసుకవచ్చింది. ఐదవ అందస్తులో ఉన్న ప్లాట్ కిటికీ అద్దాలు పగిలి పోయి బెడ్ రూమ్ లో పడింది బులెట్.  బులెట్ అద్దాలు బద్దలకొట్టుకొని రావడంతో ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు ఫ్లాట్ యజమాని. ఎవ్వరికీ ఏమి కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. 

ఇంతకు బెల్లెట్ ఎక్కడదిదా అని ఆరా తీస్తే.. మన ఆర్మీ జవాన్లదని తేలింది. ఆర్మీ ఫయరింగ్ రేంజ్ లో ఫయరింగ్ ప్రాక్టీస్ చేస్తున్న  క్రమంలో ఓ బుల్లెట్ మిస్ ఫయర్ అయ్యి అపార్ట్ మెంట్ ఐదవ అంతస్తులోకి దూసుకవచ్చిందని తేలింది.

బుల్లెట్ ఇంట్లోకి వచ్చిందని బాధ పడాలో.. లేక ఆర్మీ జవాన్లు మన కోసం మనల్ని రక్షించడానికి ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారని సంతోష పడాలో అర్థం కావట్లేదని అపార్ట్ మెంట్ బుల్లెట్ స్టోరీ విన్న వారు గుసగుసలాడుతున్నారు.