దారుణ హత్య : అధికార పార్టీ నేతను కాల్చి చంపిన దుండగులు

దారుణ హత్య : అధికార పార్టీ నేతను కాల్చి చంపిన దుండగులు

అధికార పార్టీకి చెందిన కీలక నేత హత్యకు గురికావడం స్థానికంగా కలకలం రేపింది.  బీహార్ సీఎం నితీశ్ కుమార్‌కి చెందిన పార్టీ జనతాదళ్ యునైటెడ్ యువనేత హత్యకు గురయ్యాడు. సౌరభ్ కుమార్ బుధవారం అర్ధరాత్రి పాట్నాలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తున్న క్రమంలో పర్సా బజార్ గ్రామం వద్ద బైకుపై వచ్చిన నలుగురు దుండగులు ఆయనపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. సౌరబ్ తలకు రెండు బుల్లెట్లు తాకాయి.

 ఘటనను గమనించిన స్థానికలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని ఆస్పత్రికి తరలించారు. ఈక్రమంలోనే పరిస్థితి విషమించి సౌరబ్ మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న బీహార్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజకీయ కక్షతోనే హత్య చేశారా? లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.