నాగచైతన్య దూత రిలీజ్ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

నాగచైతన్య దూత రిలీజ్ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) డిజిటల్ డెబ్యూ దూత (Dhootha) వెబ్ సిరీస్. సూపర్ నాచురల్ హారర్ స్టోరీతో తెరకెక్కుతోన్న ఈ వెబ్ సిరీస్‌ను విక్రమ్ కే కుమార్ డైరెక్ట్ చేశాడు. దూత వెబ్ సిరీస్ మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్‌తో ఇంట్రెస్టింగ్‌గా సాగుతూ..ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాల నిడివితో ఉంటుందని తెలుస్తోంది. 

ఇందులో నాగచైతన్య జర్నలిస్ట్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ వెబ్ సిరీస్ డిసెంబర్ 1న ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు. మిస్టరీని ఛేదించే సమయం వచ్చింది..అంటూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేయగా..ఆసక్తి కలిగిస్తోంది. నిజ జీవిత సంఘటనల..సమాజంలో చీకటిలో దాగున్న అంశాలను డైరెక్టర్ విక్రమ్ కుమార్ ఈ సీరిస్ ను తెరకెక్కించినట్లు టాక్.

మనం, హలో , థ్యాంక్యూ మూవీస్ తో అక్కినేని ఫ్యామిలీ డైరెక్టర్ గా మారిన విక్రమ్ ఈ హారర్ చిత్రంతో అయిన..చై కి హిట్ ఇస్తాడో లేదో చూడాలి. ఆగస్టులో ఈ సిరీస్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో రిలీజ్ చేస్తుందని వార్తలు వచ్చాయి. కాగా ఇన్నాళ్ళకి రాబోతున్న ఈ వెబ్ సిరీస్‌ను ప్రైమ్ వీడియోతో కలిసి దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు.