ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసేశారు.. విజయ్ ప్రభుత్వానికి ఇక మిగిలింది బలపరీక్షే..

ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసేశారు.. విజయ్ ప్రభుత్వానికి ఇక మిగిలింది బలపరీక్షే..

తమిళనాడులో నెలకొన్న సస్పెన్స్ మెల్లమెల్లగా సర్దుకుంటుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజరిటీని గవర్నర్ దగ్గర నిరూపించుకున్న టీవీకే విజయ్.. 2026 మే 11 (సోమవారం) తన మంత్రివర్గం, ఎమ్మెల్యేలతో పాటు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇక సీఎం జోసెఫ్ విజయ్.. పెరంబూర్ ఎమ్యెల్యేగా ప్రొటెం స్పీకర్ ముందు ప్రమాణ స్వీకారం చేశారు. 

తమిళనాడు అసెంబ్లీలో ఉదయం 9.30 గంటలకు ప్రొటెం స్పీకర్ ముందు మొదట విజయ్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత మంత్రులు ఎన్ ఆనంద, ఆధవ్ అర్జునతో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యలు కూడా బాధ్యతలు చేపట్టారు. 

ప్రతిపక్ష నేతలు కూడా ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. డీఎంకే శాసనసభా పక్ష నేత, మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, మాజీ సీఎం పలనిస్వామీ, డీఎంకే నేత పనీర్ సెల్వం మొదలైన నేతలు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.

►ALSO READ | బంగారం కొనొద్దంట.. పెట్రోల్ వాడొద్దంట.. మోదీ ఫెయిల్.. ఇవే ఫ్రూఫ్స్: రాహుల్

అయితే విజయ్ ప్రభుత్వం మే 13లోపు అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వివిధ పార్టీల ఎమ్మెల్యేల మద్ధతుతో మెజారిటీ నిరూపించుకున్న విజయ్ ప్రభుత్వం.. అసెంబ్లీలో బలపరీక్షకు నెగ్గాల్సి ఉంటుంది. ఇక టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలు మద్ధతిచ్చిన విషయం తెలిసిందే.

ప్రభుత్వ ఏర్పాటు తర్వాత కేబినెట్ శాఖల కేటాయింపు జరిగిన సందర్భంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా, డ్రగ్స్ ముప్పును ఎదుర్కోవడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌‌‌‌, మహిళల భద్రత కోసం ప్రత్యేక దళం ఏర్పాటుకు సంబంధించిన ఫైళ్లపై విజయ్ తొలి సంతకాలు చేశారు.