టెన్త్ పాసైన వారికి గుడ్ న్యూస్: సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF)లో కానిస్టేబుల్ ఉద్యోగాలు..

 టెన్త్ పాసైన వారికి గుడ్ న్యూస్: సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF)లో కానిస్టేబుల్ ఉద్యోగాలు..

కేంద్ర హోంమంత్రిత్వశాఖ  ఆధ్వర్యంలోని సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF) కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. 

మొత్తం ఖాళీలు: 10.

విభాగాల వారీగా ఖాళీలు: కానిస్టేబుల్ (బార్బర్) 03, కానిస్టేబుల్ ( వాషర్ మన్) 07.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. సంబంధిత ట్రేడ్ టెస్టులో ఉత్తీర్ణత సాధించాల్సి ఉండాలి. 

వయోపరిమితి: 18 నుంచి 23 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ ఐదేండ్లు, ఓబీసీలు మూడేండ్లు, మాజీ సైనికులకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.  

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: మార్చి 30. 

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ.100. ఎస్సీ, మాజీ సైనికులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. 

లాస్ట్ డేట్: ఏప్రిల్ 28.

సెలెక్షన్ ప్రాసెస్: పీఈటీ/ పీఎస్​టీ, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ recruitment.itbpolice.nic.inను సందర్శించండి. 

 

►ALSO READ | హైదరాబాద్ NGRIలో పార్ట్-టైమ్ ఉద్యోగాలు: ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్లకి మంచి ఛాన్స్!