లాలాగూడ, వెలుగు: ఇంట్లోకి చొరబడి వృద్ధురాలిని బెదిరించి 9 తులాల బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. లాలాగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని హరి హంత్ సదన్ అపార్ట్మెంట్ 301 ఫ్లాట్ లో నివాసముంటున్న బాల రుక్మిణి(80) బుధవారం ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి వచ్చి ఆమెను బెదిరించారు.
మెడలో ఉన్న బంగారు గొలుసుతో పాటు చేతులకున్న రెండు బంగారు గాజులను మొత్తం 9 తులాల బంగారం లాక్కొని పారిపోయారు. సమాచారం అందుకున్న లాలాగూడ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
