- ఉమ్మడి జిల్లాలో మూడో విడత ఎన్నికలు జరిగే గ్రామాలు 531
- ఇప్పటికే 62 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం
మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వెలుగు: మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. దీంతో సర్పంచ్, వార్డ్ మెంబర్ స్థానాలకు ఎంత మంది బరిలో ఉన్నారనే లెక్క తేలింది. గుర్తులు కేటాయించదంతో అభ్యర్థులు ప్రచారం మొదలు పెట్టారు. ఉమ్మడి మెదక్జిల్లాలో చివరి విడతలో 531 గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఇప్పటికే 62 సర్పంచ్, 978 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
మెదక్ జిల్లాలో...
జిల్లాలో మూడో విడతలో మొత్తం 7 మండలాల్లో 183 సర్పంచ్స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఇందులో 22 సర్పంచ్స్థానాలు ఏక్రగీవం అయ్యాయి. మిగతా161 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా 506 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 1,528 వార్డు మెంబర్ స్థానాలకు గానూ 307 ఏకగ్రీవమయ్యాయి. ఒక వార్డు స్థానానికి నామినేషన్లు దాఖలు కాలేదు. ఇవి పోను 1,220 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా 3,114 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
సంగారెడ్డి జిల్లాలో...
జిల్లాలో మొత్తం 234 గ్రామ పంచాయతీలు, 1,960 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 27 సర్పంచ్, 422 వార్డు మెంబర్స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇవి పోను 207 సర్పంచ్స్థానాలకు 576 మంది అభ్యర్థులు, 1,536 వార్డు స్థానాలకు 3,519 మంది క్యాండిడేట్లు బరిలో నిలిచారు.
సిద్దిపేట జిల్లాలో...
జిల్లాలోని హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధి అక్కన్నపేట, హుస్నాబాద్, కోహెడ, మద్దూరు, దూల్మిట్ట, సిద్దిపేట
డివిజన్ లో కొమురవెల్లి, చేర్యాల, గజ్వేల్ డివిజన్ లోని కొండపాక, కుకునూరుపల్లి మండలాల పరిధిలోని 163 గ్రామ పంచాయతీలు, 1,432 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. వీటిలో13 సర్పంచ్స్థానాలు, 249 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా సర్పంచ్స్థానాలకు 587 మంది, వార్డు మెంబర్ స్థానాలకు 3,308 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
మెదక్ జిల్లాలో ఏకగ్రీవాలు పోను జీపీలు
మండలం జీపీలు అభ్యర్థులు
చిలప్ చెడ్ 17 48
కౌడిపల్లి 28 81
కొల్చారం 18 62
మాసాయిపేట12 36
నర్సాపూర్ 33 103
శివ్వంపేట 34 105
వెల్దుర్తి 19 71
మొత్తం 161 506
సంగారెడ్డిలో ఏకగ్రీవ జీపీలు కాకుండా..
మండలం జీపీలు అభ్యర్థులు
కల్హేర్ 14 47
కంగ్టి 31 77
మనూర్ 22 71
నాగల్ గిద్ద 29 78
నారాయణఖేడ్40 120
నిజాంపేట్ 15 43
సిర్గాపూర్ 21 52
న్యాల్కల్ 35 98
మొత్తం 207 576
సిద్దిపేట జిల్లాలో ఎన్నికలు జరిగే జీపీలు
మండలం జీపీలు అభ్యర్థులు
అక్కన్నపేట 32 125
చేర్యాల 20 80
దుల్మిట 11 39
హుస్నాబాద్ 14 62
కోహెడ 25 89
కొమురవెల్లి 11 47
కొండపాక 15 71
కుకునూరుపల్లి12 33
మద్దూరు 10 41
మొత్తం 150 587

