సోషల్ మీడియా అంటే ఫొటోలు, వీడియోలు, చాటింగ్. కానీ, ఇప్పుడు సోషల్ మీడియా అంటే ఆడియో యాప్స్. వాటి ద్వారా మన మనసులోని విషయాలు, మనకు ఉన్న ఇష్టాలను తీర్చుకోవచ్చు. ఈ యాప్స్‌లో కేవలం మనకు తెలిసిన వాళ్లే కాకుండా తెలియని వాళ్లు కూడా మన మాటలు వింటారు. యాప్‌లో ఎవరెవరో లాగిన్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మాట్లాడేటప్పుడు ఎలా పడితే అలా కాకుండా కొన్ని టిప్స్ ఫాలో అయితే మిగతావాళ్లతో రిలేషన్ బాగుంటుంది. అంతేకాకుండా ఇప్పుడున్న టెక్నాలజీ జమానాలో సైబర్ ఎటాక్స్ జరిగే అవకాశాలు ఎక్కువే. అందుకే, మన ప్రొఫైల్ క్రియేట్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అని చెప్తున్నారు సైబర్ ఎక్స్‌పర్ట్స్.
డౌన్‌లోడ్‌కు ముందు
యాప్ డౌన్‌లోడ్ చేసుకునేముందు కచ్చితంగా సెక్యూరిటీ , ప్రైవసీ ఇష్యూస్ చెక్ చేసుకోవాలి. అఫీషియల్ సోర్స్ నుంచి మాత్రమే యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్లేస్టోర్, యాప్ స్టోర్ లాంటివి వాడితే బెటర్. యాప్‌కు సంబంధించి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్త వహించాలి. వేటికి పర్మిషన్ ఇస్తున్నామో చూడాలి. యాప్స్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి. ఏదైనా అనవసరమైన ఇన్ఫర్మేషన్ అనిపించినప్పుడు స్కిప్ చేయడం బెటర్.
మాట్లాడేటప్పుడు
ఆడియో యాప్స్‌లో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా పక్కవాళ్లకు విసుగు పుట్టకుండా మాట్లాడాలి. మీటింగ్స్, గ్యాదరింగ్స్‌కు వెళ్లినప్పుడు ఎంత జాగ్రత్తగా నడుచుకుంటామో వర్చువల్‌గా కూడా అలా ఉంటే బెటర్. అందుకోసం ఈ టిప్స్ ఫాలో కావాలి. యాప్ లాగిన్ అయ్యేటప్పుడు ముద్దుపేరు లాంటివి కాకుండా అసలు పేరునే పెట్టుకోవాలి. ముద్దుపేరు పెట్టాలనుకుంటే అలియాస్ అని పెట్టుకుంటే బెటర్. బయోలో ఇష్టాలు, యాప్‌లో ఎందుకు లాగిన్ అయ్యారు అనే విషయాలు క్లియర్‌గా చెప్పాలి. ఆడియో రూమ్‌లోకి ఎంటరయ్యే ముందు టాపిక్, డిస్క్రిప్షన్‌ను చూడాలి. వినాలనుకుంటే, మాట్లాడాలనుకుంటేనే రూమ్‌లోకి ఎంటరవ్వాలి. ఏదైనా విషయం గురించి మాట్లాడే ముందు ఆ రూమ్‌లో జరిగే కాన్వర్జేషన్‌ను బాగా విని రెస్పాండ్ అవ్వాలి. రూమ్‌లో జాయిన్ అయ్యేముందు మైక్ మ్యూట్ చేసుకుని ఎంటరవ్వాలి. మీకు అనిపించిన విషయం చెప్పాలంటే మైక్‌ను మ్యూట్, అన్‌మ్యూట్, మ్యూట్ చేస్తే మీరు మాట్లాడాలి అనుకుంటున్నారని మోడరేటర్‌కు అర్థం అవుతుంది. క్లబ్ హౌస్ లాంటి యాప్స్‌లో అయితే ‘హ్యాండ్ రైజ్’ ఆప్షన్ ఉంది.
ఒపీనియన్ చెప్పాలంటే టర్న్ వచ్చేవరకు ఆగాలి. ఆ తరువాతే మాట్లాడాలి. మోడరేటర్ మాట్లా డమని ఛాన్స్ ఇచ్చినప్పుడు మాత్రమే మాట్లాడాలి.
ఐఓఎస్ అప్‌డేట్‌తో ఫోన్ స్లో అయిందా?
‘ఐఓఎస్ 15’ వెర్షన్ రిలీజ్ అవ్వడానికి మరో రెండు నెలలు ఉన్నప్పటికీ, ‘ఐఓఎస్ 14’కు సంబంధించిన అప్‌డేట్స్ మాత్రం వస్తూనే ఉన్నాయి. ఈమధ్య ఐఓఎస్ 14.6 అప్‌డేట్ వచ్చింది. ఈ అప్‌డేట్‌లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నప్పటికీ, దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోకూడదనే ఎక్స్‌పర్ట్స్ సలహా ఇస్తున్నారు.
దీని ద్వారా ఐఫోన్ యూజర్స్‌కు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుండటమే ఇందుకు కారణం. 14.6 అప్‌డేట్ చేసుకోకుండా, 14.7 వచ్చేవరకు వెయిట్ చేయాలని చెప్తున్నారు. ఒకవేళ ఇప్పటికే అప్‌డేట్ చేసుకున్న వాళ్లు మాత్రం కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. బ్యాటరీ త్వరగా డ్రైన్ అవ్వడం, ఫోన్ స్లో అయిపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలకు చెక్‌పెట్టేందుకు ఇప్పటికిప్పుడు యాపిల్ కంపెనీ నుంచి ఫుల్ సపోర్ట్ అంటూ ఏమీ లేదు. దీనికి కచ్చితమైన సొల్యూషన్ లేకపోయినా, కొన్ని టిప్స్ చెప్తున్నారు ఎక్స్‌పర్ట్స్. ఐఫోన్‌ను మ్యాక్‌బుక్ లేదా కంప్యూటర్‌కు కనెక్ట్ చేసి రీస్టోర్ చేస్తే ఈ ఇష్యూ సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఫోన్ డాటా కోసం ఐక్లౌడ్ బ్యాకప్ సర్వీస్ వాడుకోవాలి. ఇలా రీస్టోర్ చేయడం ఇష్టం లేకపోతే, సెట్టింగ్స్‌లోకి వెళ్లి బ్యాటరీపై క్లిక్ చేసి, ఎక్కువ బ్యాటరీ వాడే యాప్స్ గుర్తించి, వాటిలో అక్కర్లేనివి డిలిట్ చేయాలి. అలాగే బ్యాటరీ లైఫ్ పెంచే రెగ్యులర్ టెక్నిక్స్ ఫాలో అవ్వాలి. బ్రైట్‌నెస్ తగ్గిం చడం, లో పవర్ మోడ్ వంటివి సెట్ చేసుకోవాలి.
