వేములవాడ రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ

వేములవాడ రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ

వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. శ్రావణ మాసం ప్రారంభం కావడంతోపాటు ఆదివారం సెలవురోజు కావడంతో రాజన్నను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. 

ఉదయమే ధర్మగుండంలో స్నానమాచరించి తడిబట్టలతో ఆలయంలో ప్రత్యేక క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి ప్రవేశించి రాజరాజేశ్వర స్వామి, గణపతి, అమ్మవారిని దర్శించుకున్నారు. కోరిన కోర్కెలు తీరాలని కోడె మొక్కులు చెల్లించారు.  రాజన్నను 33 వేల మంది దర్శనం చేసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.