అలర్ట్: తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు

అలర్ట్: తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు

హైదరాబాద్ : వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బంగాళఖాతం, ఉత్తర ఒరిస్సా ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమైంది. దీనికి అనుబంధంగా ఉపరితల అవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలంగాణలో రాగల రెండు మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. ఉత్తర జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవుతాయంటున్నారు. లోతట్టు ప్రాంతాలకు అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఆయా జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.