స్పెషల్​ పీజీ కోర్సులకు టిస్​ నోటిపికేషన్

స్పెషల్​ పీజీ కోర్సులకు టిస్​ నోటిపికేషన్

50 పీజీ కోర్సుల్లో అడ్మిషన్స్​కు టాటా ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ సోషల్‌‌ సైన్సెస్‌‌ (టిస్‌‌) నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. ఆర్ట్స్, హ్యుమానిటీస్‌‌ కోర్సులకు ఇది ప్రసిద్ధి. ఇక్కడి సోషల్‌‌ వర్క్, హ్యూమన్‌‌ రిసోర్స్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌లు ప్రత్యేకమైనవిగా చెప్పుకోవచ్చు. వైవిధ్యమైన కోర్సులను విస్తృత స్పెషలైజేషన్లతో అందించడం టిస్‌‌ ప్రత్యేకత. మొత్తం 50 పీజీ కోర్సులను ఈ సంస్థ ముంబయి, తుల్జాపూర్, హైదరాబాద్, గువాహటి క్యాంపస్‌‌ల్లో అందిస్తోంది.
క్యాంపస్​లు-సీట్లు: 
టిస్‌‌ ముంబయి క్యాంపస్‌‌లో 32, హైదరాబాద్‌‌లో 6, తుల్జాపూర్‌‌లో 4, గువాహటిలో 8 పీజీ కోర్సులు ఉన్నాయి. ఏ కోర్సులో చేరాలనుకున్నప్పటికీ స్టేజ్‌‌-1 పరీక్ష అందరికీ ఉమ్మడిగానే ఉంటుంది. అభ్యర్థులు డిగ్రీ కోర్సుల్లో చదువుకున్న అంశాలతో ఎలాంటి సంబంధం లేదు. ప్రశ్నలన్నీ జనరల్‌‌ విభాగానికి చెందినవే వస్తాయి. వివిధ పీజీ కోర్సులకు సాధారణ డిగ్రీ విద్యార్హతతో పోటీ పడే అవకాశం కల్పించారు. కొన్ని కోర్సులకు మాత్రం సంబంధిత విభాగంలో యూజీ పూర్తిచేసినవారే అర్హులు. అభ్యర్థులు చేరిన కోర్సులను బట్టి ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంహెచ్‌‌ఏ, ఎంపీహెచ్‌‌ డిగ్రీలను ప్రదానం చేస్తారు. ప్రతి అభ్యర్థి గరిష్ఠంగా 3 ప్రోగ్రామ్‌‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు.
సెలెక్షన్​ ప్రాసెస్​: ఏ కోర్సు ఎంచుకున్నప్పటికీ టిస్‌‌-నెట్‌‌ రాయాలి. ఈ పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా అభ్యర్థులను షార్ట్‌‌లిస్ట్‌‌ చేసి స్టేజ్‌‌ 2 పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో ప్రోగ్రామింగ్‌‌ ఆప్టిట్యూడ్‌‌ టెస్టు (పీఏటీ), ఆన్‌‌లైన్‌‌ పర్సనల్‌‌ ఇంటర్వ్యూ (ఓపీఐ) ఉంటాయి. తుది ఎంపికలో టిస్‌‌-నెట్, పీఏటీకి, ఓపీఐ..ఈ మూడింటికీ వెయిటేజీ ఉంటుంది. హ్యూమన్‌‌ రిసోర్స్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ అండ్‌‌ లేబర్‌‌ రిలేషన్స్, ఆర్గనైజేషన్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ చేంజ్‌‌ అండ్‌‌ లీడర్‌‌షిప్‌‌ ఈ రెండు కోర్సులకు దరఖాస్తు చేసుకున్నవారు పీఏటీ స్థానంలో టిస్‌‌ మ్యాట్‌‌ రాయాల్సి ఉంటుంది.
ఎగ్జామ్​ ప్యాటర్న్​: ఈ పరీక్షను ఆన్‌‌లైన్‌‌లో నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద ఆబ్జెక్టివ్‌‌ ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి వంద నిమిషాలు. ప్రశ్నలన్నీ ఆంగ్ల మాధ్యమంలోనే వస్తాయి. జనరల్‌‌ అవేర్‌‌నెస్‌‌ 40, ఇంగ్లిష్‌‌ ప్రొఫిషియన్సీ 30, మ్యాథ్స్‌‌ అండ్‌‌ లాజికల్‌‌ రీజనింగ్‌‌ 30 మార్కులకు ఉంటాయి. రుణాత్మక మార్కులు లేవు. ఇంగ్లిష్, రీజనింగ్, మ్యాథ్స్‌‌ విభాగాల్లోని ప్రశ్నలు పదో తరగతి స్థాయిలోనే ఉంటాయి. జనరల్‌‌ అవేర్‌‌నెస్‌‌లో కటాఫ్‌‌ మార్కులు పొందడం తప్పనిసరి.
హైదరాబాద్‌‌ క్యాంపస్‌‌లో ఎంఏ ఎడ్యుకేషన్, పబ్లిక్‌‌ పాలసీ అండ్‌‌ గవర్నెన్స్, డెవలప్‌‌మెంట్‌‌ స్టడీస్, నేచురల్‌‌ రిసోర్స్‌‌ అండ్‌‌ గవర్నెన్స్, రూరల్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ అండ్‌‌ గవర్నెన్స్, ఉమెన్‌‌ స్టడీస్‌‌ కోర్సులు ఉన్నాయి.
దరఖాస్తులకు చివరి తేదీ: 7 ఫిబ్రవరి 
పరీక్ష​తేది: 26 ఫిబ్రవరి
ఎగ్జామ్​ సెంటర్స్​: హైదరాబాద్, విశాఖపట్నం
వెబ్‌‌సైట్‌‌: www.admissions.tiss.edu