V6 News

ఇవాళ వెలాసిటీ, సూపర్‌‌‌‌నోవాస్‌‌  మధ్య టైటిల్‌‌ ఫైట్‌‌

ఇవాళ వెలాసిటీ, సూపర్‌‌‌‌నోవాస్‌‌  మధ్య టైటిల్‌‌ ఫైట్‌‌

పుణె:  విమెన్స్‌‌ టీ20 చాలెంజ్‌‌ ఆఖరి టోర్నీలో విజేత ఎవరో తేలే సమయం వచ్చింది. శనివారం రాత్రి జరిగే ఫైనల్లో వెలాసిటీ, సూపర్‌‌నోవాస్‌‌ జట్లు టైటిల్‌‌ కోసం అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. ఇప్పటికే రెండుసార్లు విజేతగా నిలిచిన హర్మన్‌‌ప్రీత్‌‌ కౌర్‌‌ కెప్టెన్సీలోని సూపర్‌‌ నోవాస్‌‌ జట్టు.. మూడోసారి చాంపియన్‌‌ అవ్వాలని ఆశిస్తుండగా.. దీప్తి శర్మ నేతృత్వంలోని వెలాసిటీ తొలి టైటిల్‌‌పై కన్నేసింది. నోవాస్‌‌ టీమ్‌‌లో బ్యాటింగ్‌‌లో హర్మన్‌‌, బౌలింగ్‌‌లో పూజా వస్త్రాకర్‌‌ మంచి ఫామ్‌‌లో ఉన్నారు. వెలాసిటీ జట్టులో ఓపెనర్‌‌ షెఫాలీ వర్మ, బౌలర్‌‌ కేట్‌‌ క్రాస్‌‌ రాణిస్తున్నారు. ఫైనల్లోనూ వీళ్లు కీలకం కానున్నారు. కాగా, ఈ టోర్నీ స్థానంలో  వచ్చే ఏడాది నుంచి ఆరు జట్లతో విమెన్స్ ఐపీఎల్‌‌ను ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించింది.