సంపులో పడి  చిన్నారి మృతి

సంపులో పడి  చిన్నారి మృతి

సిద్దిపేట( చిన్నకోడూరు), వెలుగు: ఆడుకుంటూ సంపులో పడి రెండేళ్ల చిన్నారి చనిపోయింది. వివరాలిలా ఉన్నాయి.. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కమ్మర్లపల్లి గ్రామానికి చెందిన గవ్వల పద్మ , రవి దంపతులకు ఇద్దరు ఆడపిల్లలున్నారు. రవి ఉపాధి కోసం ముంబై వెళ్లగా, పద్మ ఇద్దరు కూతుళ్లతో గ్రామంలో ఉంటోంది.

మంగళవారం ఉదయం చిన్నకూతురు అరుణ తేజ(2) ఆడుకుంటూ వెళ్లి ఇంటి ముందున్న నీటి సంపులో పడిపోయింది. కొద్ది సేపటి తర్వాత పద్మ స్నానం కోసం నీళ్లు తోడడానికి సంపు దగ్గరికి వెళ్లగా, అరుణ తేజ సంపులో శవమై కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చంద్రమోహన్  తెలిపారు.