సాయి ధరమ్ తేజ్ తాజా హెల్త్ బులెటిన్

V6 Velugu Posted on Sep 11, 2021

హైదరాబాద్: హీరో సాయి ధరమ్ తేజ్ తాజా హెల్త్ బులెటిన్ ను ఆస్పత్రి  వైద్యులు కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. సాయి ధరమ్ తేజ్ కు ఇంటర్నల్ గా ఎటువంటి గాయాలు లేవని స్పష్టం చేశారు. వైద్యుల చికిత్స కు సాయి ధరమ్ తేజ సహకరిస్తున్నాడని, డాక్టర్ అలోక్ రంజన్ నేతృత్వంలో చికిత్స కొనసాగుతోందని తెలిపారు. కాలర్ బోన్ కు అయిన గాయానికి  శస్త్ర చికిత్స  చేయాలా..? అవసరం లేదా ? అనే  24 గంటలు తరువాత దాని గురుంచి చూస్తామన్నారు.

నిన్న (శుక్రవారం) రాత్రి 8 గంటల సమయంలో మాదాపూర్  కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో  స్పోర్ట్స్ బైక్ పై వెళ్తూ అదుపు తప్పి జారి పడిన విషయం తెలిసిందే. రకరకాల ప్రచారాలు జరుగుతుండడంతో పోలీసులు యాక్సిడెంట్ కు సంబంధించిన సీసీటీవీ పుటేజ్ రిలీజ్ చేశారు.  మాదాపూర్ రోడ్డుపై  బైక్ పై స్పీడ్ గా వస్తున్న సాయిధరమ్ తేజ్ తన ముందున్న బైక్, ఆటోను ఓవర్ టేక్ చేయబోయి స్కిడ్ అయి పడ్డాడు.  కిందపడిన సాయిధరమ్ తేజ్ కొంతదూరం వరకు జారుకుంటూవెళ్లిపడడం స్పష్టంగా కనిపిపంచింది. ప్రమాదం జరిగిన  సమయంలో సాయిధరమ్ తేజ్ ఛాతి, పొట్ట, కంటి భాగంలో స్వల్పంగా గాయాలు కావడంతో వెంటనే సాయిధరమ్ తేజ్  స్పృహ కోల్పోయాడు.వెంటనే గుర్తించి  ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటి క్రితం వైద్యులు విడుదల చేసిన సాయి హెల్త్ బులెటిన్ ఇదే..

 


 

Tagged tollywood, Telugu film industry, , telugu cinema, hero Sai Dharam Tej, Sai Dharam Tej health updates, Sai Dharam Tej health bulletin

Latest Videos

Subscribe Now

More News