కరోనా పై రేపు మంత్రి ఈటల అత్యవసర సమావేశం

కరోనా పై రేపు మంత్రి ఈటల అత్యవసర సమావేశం

కరోనా కేసుల పెరుగుదల, చికిత్స పై సమీక్షించారు మంత్రి  ఈటల రాజేందర్. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడిన ఆయన.. రేపు(గురువారం) అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కరోనా చికిత్స అందిస్తున్న ఆస్పత్రుల సూపరింటెండెంట్ లు, నోడల్ ఆఫీసర్స్ తో సమావేశం కానున్నారు మంత్రి ఈటల. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనూ పక్క రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్న క్రమంలో అధికారులను, ఆస్పత్రి డాక్టర్లను  అలర్ట్ చేసిన మంత్రి.. మన దగ్గర కేసులు పెరిగితే తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. కరోనా నిర్ధారణ పరీక్షలు సంఖ్య మరింత పెంచడంతోపాటు.. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ పద్ధతిని ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు. కేసుల సంఖ్య పెరుగుతున్నా కూడా తీవ్రత తక్కువగా ఉందని అధికారులు మంత్రి కి వివరించారు. 

కరోనా సమయంలో సీఎం కేసీఆర్ సహకారంతో విస్తృతమైన ఏర్పాట్లు చేయడంతో డెత్ రేట్ ను గణనీయంగా తగ్గించగలిగామని మంత్రి తెలిపారు. మళ్లీ ఇప్పుడు కేసులు పెరిగిన కూడా సమర్థవంతంగా చికిత్స అందిచగలమని  తెలిపారు మంత్రి ఈటల. వ్యాక్సినేషన్  ప్రక్రియ కూడా వేగవంతంగా జరుగుతుందని, అయితే అందరికీ వాక్సిన్ అందించడానికి అవసరం అయిన డోసులు పంపించాలని ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిని కోరామని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజల పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. మాస్క్ తప్పని సరిగా ధరించాలని కోరారు, భౌతిక దూరం పాటించాలని సూచించారు. అత్యవసరం అయితే తప్ప బయటికి రావొద్దని కోరారు మంత్రి ఈటల.