పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దంపతులకు..మరో 17 ఏండ్ల జైలు

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దంపతులకు..మరో 17 ఏండ్ల జైలు

ఇస్లామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మరో 17 ఏండ్ల శిక్ష పడింది. తోషఖానా కేసులో ఇమ్రాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ఆయన భార్య బుష్రా బిబీకి ఇదే శిక్ష విధిస్తూ కోర్టు శనివారం తీర్పు వెలువరించింది. ఇప్పటికే వివిధ కేసుల్లో 2023 నుంచి ఇమ్రాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావల్పిండిలోని అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. 

అధికారంలో ఉన్నప్పుడు 2021లో సౌదీ ప్రభుత్వం నుంచి అధికారికంగా వచ్చిన గిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఇమ్రాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆయన భార్య బుష్రా బిబీ తోషిఖానాకు అప్పగించకుండా తమ సొంతం చేసుకుని అమ్ముకున్నారు. దీంతో పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం విచారణ చేపట్టి, వారిని దోషులుగా నిర్ధారిస్తూ జైలు శిక్ష విధించింది. అలాగే, 1.4 కోట్ల పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూపాయల జరిమానా విధించింది.