రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని డిసెంబర్22 నుంచి యథావిధిగా కొనసాగిస్తామని కలెక్టర్ సి. నారాయణ రెడ్డి శనివారం ప్రకటనలో తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ వల్ల తాత్కాలికంగా వాయిదా వేశామని, ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ ముగియడంతో మళ్లీ ప్రారంభిస్తున్నామన్నారు.
