అభినవ్ మణికంఠ హీరోగా బొమ్మ హిట్

అభినవ్ మణికంఠ హీరోగా  బొమ్మ హిట్

చైల్డ్ ఆర్టిస్టుగా పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన అభినవ్ మణికంఠ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘బొమ్మ హిట్’.  రాజేష్ ​ గడ్డం దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను గుర్రాల సంధ్యారాణి నిర్మిస్తున్నారు.  పూజా యడం హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం గురించి అభినవ్ మణికంఠ మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో ఫన్‌‌‌‌తోపాటు మంచి ఎమోషన్ కూడా ఉంది. 

 సిచ్యువేషనల్ కామెడీతో  ప్రేక్షకులకు  వినోదాన్ని ఇస్తుంది’ అని చెప్పాడు.  ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్‌‌‌‌తో పాటు మంచి మెసేజ్‌‌‌‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, సమ్మర్‌‌‌‌‌‌‌‌లో రిలీజ్‌‌‌‌కు ప్లాన్ చేస్తున్నామని దర్శకుడు రాజేష్​ గడ్డం అన్నాడు. ఈ మూవీలోని ప్రేమ కథతో పాటు తల్లీ దండ్రులు, కొడుకు మధ్య ఉండే అనుబంధం ఆకట్టుకుంటుందని నిర్మాత గుర్రాల సంధ్యారాణి అన్నారు. హీరోయిన్ పూజా యడం, నటులు మురళీధర్ గౌడ్, హైపర్ ఆది, జబర్దస్త్ అవినాశ్ ఈ చిత్రంలో నటిస్తున్నారు.