పాజిటివ్‌‌‌‌ రెస్పాన్స్‌‌‌‌తో గుర్రం పాపిరెడ్డి

పాజిటివ్‌‌‌‌ రెస్పాన్స్‌‌‌‌తో గుర్రం పాపిరెడ్డి

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన  సినిమా  ‘గుర్రం పాపిరెడ్డి’. మురళీ మనోహర్ దర్శకత్వంలో  వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మించారు. డిసెంబర్ 19న సినిమా విడుదలైంది. సినిమాకొస్తున్న రెస్పాన్స్ తెలియజేస్తూ  మూవీ టీమ్ శనివారం ప్రెస్‌‌‌‌మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నరేష్ అగస్త్య మాట్లాడుతూ ‘మా సినిమాకు రెస్పాన్స్ చాలా బాగుంది.  బుక్ మై షోలో బుకింగ్స్ ఎంకరేజింగ్​గా ఉన్నాయి.  90 పర్సెంట్ థియేటర్స్ ఫిల్ అవుతున్నాయి.  ఇదే రెస్పాన్స్  కంటిన్యూ చేస్తూ మూవీని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా’ అని అన్నాడు.  

తన సినిమాలైనా ఒక క్రిటిక్‌‌‌‌గా చూస్తానని, ఇందులో అందరం బాగా పెర్ఫార్మ్ చేశామని ఫరియా అబ్దుల్లా చెప్పింది.  డైరెక్టర్ మురళీ మనోహర్ మాట్లాడుతూ ‘అవతార్ రిలీజ్ వల్ల మా మూవీకి మార్నింగ్ షోస్ స్లోగా మొదలయ్యాయి. మ్యాట్నీ నుంచి పికప్ అయి, సాయంత్రానికి  90 శాతం ఆక్యుపెన్సీ వచ్చింది. ఈ వీకెండ్‌‌‌‌లో  మరింత ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాం’ అని అన్నాడు.  తమ చిత్రానికి పాజిటివ్ ఫీడ్ బ్యాక్‌‌‌‌ రావడం హ్యాపీగా ఉందని నిర్మాతలు అన్నారు. నటులు వంశీధర్ , రాజ్‌‌‌‌ కుమార్ కసిరెడ్డి, జీవన్ కుమార్,  మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ సౌరభ్ పాల్గొన్నారు.