మోగ్లీని గెలిపించిన అందరికీ థ్యాంక్స్

మోగ్లీని  గెలిపించిన అందరికీ థ్యాంక్స్

రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్ జంటగా  సందీప్ రాజ్ దర్శకత్వంలో టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన  చిత్రం ‘మోగ్లీ 2025’.  డిసెంబర్ 13న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని టీమ్ తెలియజేసింది.  ఈ సందర్భంగా నిర్వహించిన  థ్యాంక్స్  మీట్‌‌‌‌కు అతిథిగా హాజరైన హీరో సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ ‘మోగ్లీ నాకు చాలా ఫేవరెట్. చిన్నప్పుడు నుంచి  ఆ క్యారెక్టర్ చూస్తూ పెరిగా.  ఆ టైటిల్‌‌‌‌తో సినిమా రావడం ఆనందాన్ని ఇచ్చింది.  

రోషన్ చాలా బాగా నటించాడు. ఆడియెన్స్‌‌‌‌ సపోర్ట్‌‌‌‌తో  ఈ సినిమా సక్సెస్ అయింది.  ఇండస్ట్రీలో  హార్డ్ వర్క్ మాత్రమే మాట్లాడుతుంది.  రోషన్  మరింత గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నా’ అని చెప్పాడు. ఈ మోగ్లీని గెలిపించిన ప్రతి ఒక్కరికీ శిరస్సువంచి  నమస్కరిస్తున్నా అని రోషన్ కనకాల అన్నాడు.  ఈ సక్సెస్‌‌‌‌ని  గొప్ప బాధ్యతగా తీసుకుంటున్నా అని సాక్షి మడోల్కర్ చెప్పింది. 

నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ ‘మేము చిన్న సినిమాని తీసాం. కానీ ఆడియెన్స్ చాలా పెద్ద సక్సెస్ ఇచ్చారు. ప్రమోషన్స్‌‌‌‌కి వెళ్ళిన ప్రతిచోటా మంచి రెస్పాన్స్ దక్కింది’ అని అన్నారు.