హీరోగా రిస్క్ తీసుకోనంటున్న నెల్లూరు సుదర్శన్..

హీరోగా  రిస్క్ తీసుకోనంటున్న నెల్లూరు సుదర్శన్..

షార్ట్ ఫిలింస్ ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తన ఊరు పేరునే ఇంటిపేరుగా మార్చుకుని  నటుడిగా సక్సెస్‌‌‌‌ఫుల్‌‌‌‌ జర్నీ కొనసాగిస్తున్నాడు నెల్లూరు సుదర్శన్. దాదాపు 170కిపైగా చిత్రాల్లో నటించిన ఆయన రీసెంట్‌‌‌‌గా ‘హే బలవంత్‌‌‌‌’ సినిమాలో కీలక పాత్రలో నటించి తనదైన హాస్యాన్ని పండించాడు. సుహాస్, శివానీ నాగారం జంటగా గోపీ అచ్చర దర్శకత్వంలో బి నరేంద్ర రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని  ఫిబ్రవరి 20న వంశీ నందిపాటి విడుదల చేశారు. సినిమాతోపాటు తన పాత్రకు కూడా  మంచి రెస్పాన్స్ వస్తోందని చెబుతున్న  సుదర్శన్ ఈ సందర్భంగా  మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో  నేను పోషించిన బంక పాత్రను ఆడియెన్స్‌‌‌‌ బాగా ఎంజాయ్‌‌‌‌ చేస్తున్నారు. 

సినిమా ఆద్యంతం ఎంటర్‌‌‌‌టైనింగ్‌‌‌‌గా ఉందని మంచి ప్రశంసలు వస్తున్నాయి. నా పాత్రకు ఇంపార్టెన్స్‌‌‌‌ వల్ల బాగా ఎలివేట్‌‌‌‌ అయ్యింది.  డ్రింకింగ్‌‌‌‌ సీన్‌‌‌‌, వెన్నెల కిషోర్‌‌‌‌తో చేసిన  ప్రకృతి చికిత్సాలయం సీన్స్‌‌‌‌కు థియేటర్స్‌‌‌‌ ఊగిపోతున్నాయి. నా ప్రతి పంచ్‌‌‌‌తో పాటు  వెన్నెల కిషోర్‌‌‌‌, సుహాస్‌‌‌‌, నరేష్‌‌‌‌, శివానీ అందరూ హిలేరియస్‌‌‌‌గా నవ్వించారు. ఇక హీరోగా అవకాశాలు వస్తున్నా  ఇప్పుడే చేయను.

కమెడియన్‌‌‌‌గా ఇప్పుడిప్పుడే  ఎదుగుతున్నా. ఈ టైమ్‌‌‌‌లో రిస్క్‌‌‌‌ తీసుకోలేను.  నటుడిగా  ప్రస్తుతానికి  బిజీగానే ఉన్నా. డేట్స్‌‌‌‌ క్లాష్‌‌‌‌ వల్ల  కొన్ని సార్లు మంచి సినిమాలు కూడా వదులుకోవాల్సి ఉంది’ అని చెప్పాడు.