రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్స్. సంక్రాంతి కానుకగా జనవరి 13న సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆషికా రంగనాథ్ మాట్లాడుతూ ‘ఇదొక ఎంటర్‌టైనింగ్ ఫన్ ఫ్యామిలీ ఫిల్మ్. మోడరన్ రిలేషన్‌షిప్ గురించి హ్యూమరస్ సెన్సిబుల్‌గా చెబుతున్నాం.
ఇందులో మానస శెట్టి పాత్రలో కనిపిస్తా. సినిమా చూస్తున్నప్పుడు ఒక సంక్రాంతి పండగలా ఉంటుంది’ అని చెప్పింది. ఇది తన ఫస్ట్ సంక్రాంతి మూవీ అని, ఇందులో బాలామణి క్యారెక్టర్‌లో కనిపిస్తానని డింపుల్ హయతి చెప్పింది. ఈ చిత్రం రవితేజ గారి మార్క్ ఫన్‌తో ఆడియెన్స్‌ను హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్‌టైన్ చేసేలా ఉంటుందని దర్శకుడు కిషోర్ తిరుమల చెప్పాడు.
నిర్మాత సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ ‘ఇది కంప్లీట్ ఫన్ ఫిల్మ్. మాతో పాటు వస్తున్న సినిమాలు కూడా బాగా ఆడి కొత్త సంవత్సరంలో అందరూ హ్యాపీగా ఉండాలి. ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.
