ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్‌గా ‘మా వందే’ చిత్రం తెరకెక్కుతోంది. మలయాళ హీరో ఉన్ని ముకుందన్ లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ చిత్రాన్ని సీహెచ్ క్రాంతికుమార్ దర్శకత్వం వహిస్తుండగా, ఎం. వీర్ రెడ్డి నిర్మిస్తున్నారు. శనివారం పూజా కార్యక్రమాలతో రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించారు. ప్రధాని మోదీ వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని విశేషాలన్నీ ఈ చిత్రంలో చూపించబోతున్నట్టు మేకర్స్ చెప్పారు.
ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పదనే సందేశంతో మోదీ జీవితంలోని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా పాన్ ఇండియా భాషలతో పాటు ఇంగ్లిష్‌లో తెరకెక్కిస్తున్నారు. రవీనా టాండన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి కె.కె.సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా, సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా, కింగ్ సొలొమన్ ఫైట్ మాస్టర్‌గా వర్క్ చేస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.
