టాస్క్ ఫోర్స్ లో మాస్ ట్రాన్స్ ఫర్స్..80 మంది సిబ్బంది బదిలీ : సీపీ సజ్జనార్

టాస్క్ ఫోర్స్ లో మాస్ ట్రాన్స్ ఫర్స్..80 మంది సిబ్బంది బదిలీ : సీపీ సజ్జనార్

 

  • అవినీతి ఆరోపణలతో సీపీ సజ్జనార్ నిర్ణయం

హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీ సీపీ సజ్జనార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టాస్క్‌ ఫోర్స్​లోని దాదాపు 80 మంది సిబ్బందిని (ఎస్సై నుంచి కానిస్టేబుల్ వరకు) ఒకేసారి బదిలీ చేశారు. వీరిని సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్​క్వార్టర్స్​కు అటాచ్ చేశారు. 

కొన్నేండ్లుగా టాస్క్‌ ఫోర్స్​లో కొనసాగుతున్న ఈ అధికారులపై ఇటీవల అవినీతి, మామూలు వసూళ్లు, గ్యాంగ్​ల నుంచి డబ్బులు తీసుకోవడం, నిందితులను తప్పించేందుకు లంచాలు అందుకోవడం వంటి ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో స్పెషల్ బ్రాంచ్ విచారణ నేపథ్యంలో అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ పేరుతో ఈ మాస్ ట్రాన్స్‌ఫర్లు జరిగాయి. అవినీతిపై జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తామని సీపీ సజ్జనార్ గతంలోనే స్పష్టం చేశారు.