హైదరాబాద్ లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు

ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా రేపు   హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.  మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆంక్షలు ఉంటాయి. పంజాగుట్ట, గ్రీన్ ల్యాండ్స్, ప్రకాష్ నగర్, రసూల్ పుర, ప్యాట్నీ సిగ్నల్ వరకు ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. సోమాజిగూడా,రాజ్ భవన్ రోడ్, ఖైరతాబాద్ జుంక్షన్ వరకు ట్రాఫిక్ ఉండే అవకాశాలు ఉన్నాయి. రేపు మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ రూట్స్ ని అవాయిడ్ చేయాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

ప్రధాని మోడీ రేపు మధ్యాహ్నం 1.30కి బేగంపేట ఎయిర్​పోర్ట్‌‌‌‌‌‌‌‌కు చేరుకుంటారు. బీజేపీ లీడర్లు, కార్యకర్తలు  ప్రధానికి ఘన స్వాగతం పలకనున్నారు. అక్కడే బీజేపీ ముఖ్య నేతలతో మోడీ కాసేపు మాట్లాడుతారు. తర్వాత 2.15 గంటలకు ఎంఐ–17 హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రామగుండం బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం 3.30కు రామగుండం ఎరు వులు, రసాయనాల పరిశ్రమ (ఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌)ను ప్రధాని ప్రారంభిస్తారు. సాయంత్రం 4.15కి పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం రామగుండంలోని ఎన్టీపీసీ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో జరి గే బహిరంగ సభలో మోడీ మాట్లాడుతారు.