350 మందికి కల్యాణ లక్ష్మి చెక్కులు

350 మందికి కల్యాణ లక్ష్మి చెక్కులు

ఘట్​కేసర్, వెలుగు: పేదింటి ఆడబిడ్డల పెండ్లికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో భరోసా ఇస్తున్నదని ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర వజ్రేశ్ యాదవ్ అన్నారు. శనివారం ఘట్​కేసర్ సర్కిల్ పరిధిలోని శివారెడ్డిగూడలో 350 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డితో కలిసి వారు పంపిణీ చేశారు. మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మట్లాడుతూ..  చెక్కులతోపాటు తులం బంగారం కూడా ఇస్తే బాగుంటుందన్నారు. 

మేడ్చల్ కలెక్టరేట్: అనంతరం ముడుచింతలపల్లి పరిధిలోని జగన్​గూడలో తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా మీట్ 2025–-26ను చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మల్లారెడ్డి కలిసి ప్రారంభించారు.