స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి : ఝాన్సీరెడ్డి

 స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి : ఝాన్సీరెడ్డి

తొర్రూరు, వెలుగు : స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ సత్తాచాటాలని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, పాలకుర్తి నియోజకవర్గ ఇన్​చార్జి హనుమాండ్ల ఝాన్సీరెడ్డి అన్నారు. గురువారం మహబూబాబాద్​ జిల్లా తొర్రూరు మండలం పెద్దామంగ్య తండాలో బీఆర్ఎస్‌‌కు చెందిన పలువురు కీలక నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

వారికి ఝాన్సీరెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో జాటోత్ దేవా నాయక్, యకు నాయక్, లింగా నాయక్, దేవ, మోహన్ నాయక్, రమేశ్​నాయక్, శ్రావణ్ నాయక్, కుమార్ నాయక్, పూల్ సింగ్ నాయక్, ధర్మా నాయక్, సుధాకర్ నాయక్, పెద్దవంగర మండలం ఆర్​సీ తండాకు చెందిన ఆమ్లా సకృ నాయక్, భోజ్య నాయక్, నెహ్రు నాయక్ తదితరులు ఉన్నారు.