
హైదరాబాద్, వెలుగు: శ్రీనిధి యూనివర్సిటీ తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ (టీపీజీఎల్) ఐదో ఎడిషన్‌కు ముందు హైదరాబాద్ గోల్ఫ్ కోర్సులో ప్లేయర్ల వేలంను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించారు. ఈ నెల 25 నుంచి నవంబర్ 23 వరకు జరిగే టోర్నీలో పోటీ పడుతున్న 16 జట్లు మొత్తం 192 గోల్ఫర్లను ఎంపిక చేసుకున్నాయి. ఈ ఆన్‌లైన్ వేలంలో ఆయా ఫ్రాంచైజీ ఓనర్లు, కెప్టెన్లు, స్పాన్సర్లు పాల్గొన్నారు.
స్పాన్సర్ శ్రీనిధి ఎడ్యుకేషనల్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ మహే, హెచ్‌జీఏ ప్రెసిడెంట్ బీవీ కృష్ణారావు, తదితరులు హాజరయ్యారు. ఈ టోర్నీలో బరిలో నిలిచిన ఆటమ్ చార్జర్స్ టీమ్‌కు గడ్డం సరోజా స్పాన్సర్‌గా, భూషణ్ బైరాగని కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 19న ఐదో సీజన్ అఫీషియల్ లాంచ్‌లో ట్రోఫీ, టీమ్ జెర్సీలను ఆవిష్కరిస్తారని టీపీజీఎల్ కమిషనర్ సంజయ్ కమ్తం తెలిపారు.