మేడారం టీం,వెలుగు : మేడారం జాతర చివరి రోజు శనివారం భక్తులకు ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. బస్టాండ్ కు మూడు కిలోమీటర్ల దూరం నుంచే భక్తులు బస్సులు దిగి కాలినడకన అమ్మవార్ల దర్శనానికి బాట పట్టారు. బస్టాండ్ ఆవరణలోనూ బస్సులు పార్కింగ్ కు జాగా లేకపోవడంతో రోడ్డుపైనే నిలిచాయి.
ఐదు నిమిషాలు ముందుకు కదిలితే.. అరగంట సేపు ఆగిపోతుండగా విసుగు చెందారు. దీంతో చేసేదేం లేక భక్తులు దిగి నడిచి వెళ్లారు. ఆర్టీసీ ఆఫీసర్ల తీరుపై మండిపడ్డారు. జాతరకు 4 వేల బస్సులను నడిపినట్టు, 15 వేల ట్రిప్పుల్లో 5.25 లక్షల మంది ప్రయాణికులను తరలించినట్లు ఆర్టీసీ చీఫ్ట్రాఫిక్ మేనేజర్ ఎ. శ్రీధర్ తెలిపారు.
